మంత్రాలయం, జూలై 24
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు మండల, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ (జంగల్ హనుమాన్ ఆలయం)లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రజా పోరాటాలే తన జన్మదిన వేడుకలుగా భావించి, ప్రజల సంక్షేమానికి తన పుట్టినరోజును అంకితం చేసిన కేటీఆర్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నీట్ (NEET) విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోసారి ప్రజల పక్షాన తన అంకితభావాన్ని చాటిచెప్పిన కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోయఫ్ హుస్సేన్, బాదం కుర్తి మాజీ ఎంపిటిసి శ్రావణ్ కుమార్, రామ్ నాయక్, కొక్కుల ప్రదీప్, మున్సిపల్ కౌన్సిలర్ రాజా గంగన్న, తోడుశం ఇంద్ర, బీసీ రాజన్న, వాల్ సింగ్, ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












