న్యూఢిల్లీ, 2026-08-04
బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన అవమానకరమైన ఓటమి రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సోషల్ మీడియా ఎక్స్‌లో బేబీ ఒక పోస్టు చేశారు.
బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన అవమానకరమైన ఓటమి రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సోషల్ మీడియా ఎక్స్‌లో బేబీ ఒక పోస్టు చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారని, మూడు దశాబ్దాలకు పైగా ఈ స్థానంలో బీజేపీ విజయం సాధించిందని బేబీ తన పోస్టులో గుర్తు చేశారు.
ఓట్ల శాతం తగ్గుదల
ఎన్నికల కమిషన్ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు 28 శాతం తగ్గాయని బేబీ తెలిపారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనల అనంతరం వచ్చిన ఈ ప్రజా తీర్పు.. అహంకారం, విభజన రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాలను సవాలు చేయవచ్చు అని, చేస్తామనే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు.
ప్రజల సందేశం
అలాగే, ఈ తీర్పుతో ప్రజలు తాము జవాబుదారీతనం కోరుకుంటున్నాం, నిరంకుశత్వం కాదు అనే ఒక స్పష్టమైన సందేశం పంపారని తెలిపారు. తొలిసారిగా విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్‌కు ఎం.ఏ. బేబీ అభినందనలు తెలిపారు.
ముందున్న కర్తవ్యం
దేశవ్యాప్తంగా మతతత్వ-కార్పొరేట్ ఎజెండాను ఓడించడానికి, ప్రజా పోరాటాలను బలోపేతం చేసి, వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల విస్తృత ఐక్యతను సాధించడం ద్వారా ఈ ఉపును ముందుకు తీసుకెళ్లడమే ముందున్న కర్తవ్యమని బేబీ పేర్కొన్నారు.












