మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 02
లక్షట్ పేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ప్రముఖ కవి, గాయకుడు, నటుడు, రాగావధాని పొనకంటి దక్షిణామూర్తికి సత్కళాభారతి పురస్కారం బహుకరించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో గంజి సత్యనారాయణ 77వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారం అందజేశారు.
లక్షట్ పేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ప్రముఖ కవి, గాయకుడు, నటుడు, రాగావధాని పొనకంటి దక్షిణామూర్తికి సత్కళాభారతి పురస్కారం లభించింది.
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రంగస్థల నటులు, దర్శకులు, టీవీ, సినీ నటులు గంజి సత్యనారాయణ 77వ జన్మదినం సందర్భంగా నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని బహుకరించారు. తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, తెలుగు వర్సిటీ వీసీ కోట్ల హనుమంతరావు, నాటక రచయిత డాక్టర్ పురుషోత్తమాచార్య పాల్గొని గంజి సత్యనారాయణ రంగస్థలం, సంగీతం, సాహిత్యం, కళారంగాలకు చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా దక్షిణామూర్తి ప్రామాణిక పద్యగానం, గంజి సత్యనారాయణచే హరే శ్రీకృష్ణ ఏకపాత్రాభినయం అలరించాయి. కిన్నెర కార్యదర్శి రఘురామ్ పాల్గొన్నారు.












