ముధోల్, 2026-06-05
అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా, యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల వ్యాకరణాన్ని వివరిస్తూ ముధోల్‌కు చెందిన విశ్రాంత అధ్యాపకుడు, ఆంగ్ల భాషా నిపుణుడు సారథి రమేష్ రచించిన పుస్తకాన్ని సోమవారం స్థానిక రబింద్రా ఉన్నత పాఠశాలలో పరిచయం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆంగ్ల వ్యాకరణంపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు. సారథి రమేష్ సాధారణ భాషలో యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకం విద్యార్థులకు, యువతకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. జ్ఞానమే శక్తి అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులు పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
వారి ఆలోచనలు, ఆశయాలను తెలుసుకుని వారి మార్గంలో నడవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎంతో అవసరమన్నారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకుంటే ఆలోచనా శక్తి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని చెప్పారు. యువత తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పుస్తకాలను చదవాలని సూచించారు.
అనంతరం పుస్తక రచయిత సారథి రమేష్‌ను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.