ఖానాపూర్, 2026-06-05
పూతూ(ననన)నఆపణతతత.ఈననత.ఈపనణఫశ.
మస్కాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నిబంధనలకు విరుద్ధంగా గెస్ట్ టీచర్ల నియామకం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియామకాలను వెంటనే రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ప్రజావాణిలొ ఎంపిడివో గారికి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం, ప్రాజెక్టు డైరెక్టర్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నియామక ప్రక్రియను పాటించకుండానే గెస్ట్ టీచర్లను నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, నియామక ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత నియామకాన్ని రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
కేజీబీవీలు బాలికల విద్యకు సంబంధించిన కీలకమైన ప్రభుత్వ విద్యాసంస్థలు కావడంతో, ఇలాంటి నియామకాల విషయంలో పారదర్శకత, అర్హత, నిబంధనల పాటింపు తప్పనిసరిగా ఉండాలని వారు పేర్కొన్నారు. అక్రమ నియామకాల వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నియామకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిగినట్లు నిర్ధారణ అయితే గెస్ట్ టీచర్ నియామకాన్ని రద్దు చేయాలని ఫిర్యాదుదారులు, అడ్వకేట్ సాధుల శ్రీనివాసన్, బీసీ రమేష్ లు కోరారు.






