.యువ క్రీడాకారులను ప్రోత్సహించాలి : రమేష్ ముదిరాజ్
మిర్యాలగూడ ఆగస్టు 16 ( మనోరంజని తెలుగు టైమ్స్)
యువ క్రీడాకారులను స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంటు రమేష్ ముదిరాజ్ కోరారు. పట్టణంలోని
షాబునగర్ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా
యువకులను ప్రోత్సహించేందుకు బంటు రమేష్ నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్న క్రీడాకారులందరికీ, విజేతలకు ట్రోఫీ బహుమతులను రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి, ప్రతిభగల క్రీడాకాలను విశేషంగా ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ పట్టుదలతో క్రీడల్లో రాణించి ప్రతిభను చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో పోలగాని యాదయ్య, బంటు మహేష్, కోళ్ల రవి, నక్క నాగరాజు, రంగా, బంటుశివకుమార్, తదితరులుపాల్గొన్నారు.












