గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక కరాటే పోటీలలో ఎండి అమీర్ కు గోల్డ్ మెడల్ :
మిర్యాలగూడ ఆగస్టు 16 (మనోరంజని తెలుగు టైమ్స్)
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కోయంబేడులో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక కరాటే పోటీలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎంఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఎండి. అమీర్ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు.క్రమశిక్షణ, పట్టుదల,ఆత్మవిశ్వాసం, అంకితభావంతో శిక్షణ పొందిన విద్యార్థులు ఈ ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక కార్యక్రమంలో భాగస్వాములై రికార్డు సాధించేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రతిభ ను కనబరిచిన విద్యార్థులకు అకాడమీ నిర్వాహకులు, శిక్షకులు తల్లిదండ్రులు గోల్డ్ మెడల్ సాధించిన అమీర్ తో పాటు పతకాలు సాధించిన వారికి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.












