మిర్యాలగూడ, జూన్ 30
బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో కళాశాలలు మంగళవారం బంద్ పాటించాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ఈ బంద్ జరిగింది. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు.
బీసీ విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపుమేరకు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని కళాశాలలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు.
విద్యార్థులకు అందాల్సిన పెండింగ్ ఫీజు బకాయిలు ప్రభుత్వం పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధిస్తున్నాయని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ ఫీజు బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల చేసి బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలవాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, పట్టణ నాయకులు పట్టేటి రమేష్, నియోజకవర్గ నాయకులు మునగాల శైలేందర్, పట్టణ కన్వీనర్ ఉపేందర్, రాజు, శంకర్ పాల్గొన్నారు.











