లోకేశ్వరం, 2026-08-12
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు లోకేశ్వరం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. స్థానిక హైస్కూల్ నుంచి భగత్‌సింగ్ చౌక్ వరకు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీగా తరలివెళ్లారు.

దేశభక్తి నినాదాలు
ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో దేశభక్తి నినాదాలు మార్మోగాయి. కార్యక్రమంలో మండల హర్ ఘర్ తిరంగా ఇన్చార్జ్ రవి పాండే, సీనియర్ నాయకులు మెండే శ్రీధర్, రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి ఒడ్నాల మురళితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.