ఖానాపూర్, జూలై 24
ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని గోసంపల్లె గ్రామ సర్పంచ్ కొక్కుల సుభద్ర ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. వ్యవసాయ పొలంలో వరి నాట్లతో 'KTR' అని అక్షరాలు వచ్చేలా ప్రత్యేకంగా నాట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదిన వేడుకలను ఖానాపూర్ నియోజకవర్గంలోని గోసంపల్లె గ్రామ సర్పంచ్ శ్రీమతి కొక్కుల సుభద్ర (బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కొక్కుల శేఖర్ గారి తల్లిగారు) ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు.
గోసంపల్లె గ్రామంలోని వ్యవసాయ పొలంలో పచ్చని వరి నాట్లతో 'KTR' అనే పేరు వచ్చేలా ప్రత్యేకంగా నాట్లు వేసి కేటీఆర్ గారి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రైతుల పక్షాన కేటీఆర్ గారు చేస్తున్న నిరంతర పోరాటాలకు గుర్తుగా, రైతు సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న కృషికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సర్పంచ్ శ్రీమతి కొక్కుల సుభద్ర తెలిపారు.
'రైతు గుండెల్లో కేటీఆర్.. పచ్చని పొలంలో 'KTR' గారు' అంటూ గ్రామస్థులు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.












