జగిత్యాల, జులై 06
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంతరాలయంలోని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు.
అనంతరం 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.












