బాసర, జూలై 05
నిర్మల్ జిల్లా బాసరలో చదువుల తల్లి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే, అధికారుల సమక్షంలో అమ్మవారి ఉత్సవమూర్తుల ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు బాలాలయంలో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.
దక్షిణ భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి నిర్మల్ జిల్లా బాసరలో ఎన్నో దశాబ్దాల కల ఈవేళ నెరవేరింది. ఆలయ పునర్నిర్మాణ పనులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే, అధికారుల సమక్షంలో ప్రారంభమయ్యాయి. ఆలయంలోని అలంకరణ, అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం వరకు స్థానిక గ్రామస్తులతో పాటు భక్తులకు అమ్మవారి దర్శన సౌభాగ్యం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
రెండవ దశబ్ద కాలంలో నిర్మించిన ఈ ఆలయం గతంలో చోళుల రాజ్యంలో నిర్మించినట్లు పురాణం చెబుతుంది. ప్రస్తుతం కొన్ని కోట్ల వ్యయంతో దాతల సహకారంతో పూర్ణ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నూతన ఆలయం నిర్మించే వరకు సాంప్రదాయ పద్ధతిలో భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కలపకర్షణ పూజలు శృంగేరి పీఠాధిపతి శిష్య బృందం, వేద పండితుల వేదమంత్రాల మధ్య జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తులను బాలాలయంలోకి తీసుకువెళ్లే సమయంలో స్థానిక పేద పండితులు, వేదమంత్రాల ఘోషలతో ఉత్సవమూర్తులను బాలాలయంలోనికి తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం, అలంకరణ, గణపతి, కలపకర్షణ, పూర్ణాహుతితో పూజలు ముగించి, అనంతరం ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్టించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి అంజన దేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, సంజు పూజారి ఆదేశాల మేరకు బాలాలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక అక్షరాభ్యాసాలు, ధ్యాన మందిరంలో 150 రూపాయల అక్షరాభ్యాసాలు యధావిధిగా కొనసాగుతాయని, నేరుగా దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
మహంకాళి అమ్మవారితోపాటు ప్రధాన ఆలయ గర్భగుడిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు గమనించి బాలలయంలోని ప్రత్యేక పూజలు కొనసాగించాలని కోరారు. పునర్నిర్మాణ పనులకు అందరూ సహకరించి, ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని రకాల ప్రత్యేక భారీకేడ్లు నిర్మించడం జరిగిందని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా దర్శనాలు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఏఈఓ గంగ శ్రీనివాస్, సూపర్డెంట్ శివరాజ్, సంజీవరావు, నారాయణ పటేల్, సాయిలు, రాజేందర్, బాసర మండల బిజెపి అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ పటేల్, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.












