Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖానాపూర్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) రాధా రాథోడ్ స్పష్టం చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
భవిష్యత్ తరాలకు నీటి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖానాపూర్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) రాధా రాథోడ్ అన్నారు.
జిల్లాలో నిర్వహిస్తున్న రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మంగళవారం నాడు జరిగిన సమావేశంలో గ్రామస్థులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణలోని వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్-నినో ప్రభావం, వాతావరణ మార్పులు, భవిష్యత్లో ఎదురయ్యే నీటి కొరత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫార్మ్పాండ్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆశా సేవికలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












