Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
లోకేశ్వరం మండల కేంద్రంలో మంగళవారం జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ప్రతి చేనుకు ఫామ్పాండ్లు, ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి నీటి కొరతను అధిగమించవచ్చని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
లోకేశ్వరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో మంగళవారం జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ప్రతి చేనుకు ఫామ్పాండ్లు, ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించి నీటి కొరతను అధిగమించవచ్చని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్ మాట్లాడుతూ, నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి కుటుంబం మ్యాజిక్ సోక్‌పిట్ నిర్మించుకోవాలని సూచించారు. రైతులు తమ పొలాల్లో ఫామ్పాండ్లు ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని, జలసిరి కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమం భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించే లక్ష్యంతో అమలు అవుతోందని తెలిపారు. వర్షపు నీటిని వృథా కాకుండా బోర్వెల్ రీచార్జ్, రూఫ్‌టాప్ రైన్వాటర్ హార్వెస్టింగ్, మ్యాజిక్ సోక్పిట్ల నిర్మాణంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఇన్చార్జి ఏపీఓ అనిల్ మాట్లాడుతూ, వి బి జి రామ్ జి పథకం ద్వారా ఫామ్పాండ్లు, కమ్యూనిటీ సోక్పిట్లు వంటి నీటి సంరక్షణ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులు, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నీటి వనరులను పెంపొందించేందుకు ముందుకు రావాలని, భూగర్భ జలాలను కాపాడితేనే భవిష్యత్‌లో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్కంపల్లి లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.












