లోకేశ్వరం, 6 September
మండలం కనకాపూర్ నది ఒడ్డున వెలసిన శ్రీ బ్రహ్మేశ్వర ఆలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రశాంతమైన నదీ తీరంలో కొలువైన పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేక రోజుల్లో ఆలయానికి చేరుకుంటారు.
కనకాపూర్ బ్రహ్మేశ్వర క్షేత్రం.. భక్తి విశ్వాసాలకు నిలయం! మండలం కనకాపూర్ నది ఒడ్డున వెలసిన శ్రీ బ్రహ్మేశ్వర ఆలయం ఎంతోకాలంగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రశాంతమైన నదీ తీరంలో కొలువైన పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేక రోజుల్లో ఆలయానికి చేరుకుంటారు. ఆలయ గర్భగుడిలో పూలతో అలంకరించిన శివలింగం, పక్కనే కొలువైన వినాయక స్వామి, నిత్యం వెలిగే దీపాలు భక్తి భావాన్ని మరింత పెంచుతున్నాయి. శివలింగానికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.నది తీరం.. పురాతన ఆలయం.. శివనామస్మరణ.. ఈ మూడు కలిసిన చోట కలిగే ఆధ్యాత్మిక అనుభూతి ప్రత్యేకమైనదని భక్తుల విశ్వాసం. “నది ఒడ్డున కొలువైన బ్రహ్మేశ్వరుడు.. భక్తుల హృదయాల్లో వెలసిన మహాశివుడు..”ఈ పురాతన ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి, కనకాపూర్కు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు, భక్తులు కోరుకుంటున్నారు.











