సారంగాపూర్, జూలై 16
సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ ఉపసర్పంచ్ బింగి గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ ఉపసర్పంచ్ బింగి గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సమక్షంలో గంగాధర్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసేందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని గంగాధర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొల్లోజి నర్సయ్య, నవీన్ రెడ్డి, పవార్ రాజేష్, ముత్యం రెడ్డి, భూమారెడ్డి, రాజేందర్, వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












