మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును నియమించారని, ఈ నేపథ్యంలో ఇచ్చోడా మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం సంబరాలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు గారిని నియమించడంతో ఇచ్చోడా మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు.
స్టేట్ టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జ్‌లను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీ రాథోడ్ బాపురావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన సమర్థ నాయకత్వంలో మరింత కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ నియామకంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఇచ్చోడా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు రాథోడ్ బాపురావు గారిని అభినందిస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.












