నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగిన వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ డి. అంజయ్య కుమారుడు విజయ్ పెళ్లి సెటిల్మెంట్ కార్యక్రమానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇరు కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ అపార్ట్మెంట్లో ఆదివారం నిర్వహించిన వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ డి. అంజయ్య కుమారుడు విజయ్ పెళ్లి సెటిల్మెంట్ కార్యక్రమానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెళ్లి సెటిల్మెంట్ శుభప్రదంగా పూర్తికావడంతో ఇరు కుటుంబ సభ్యులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆప్యాయంగా ముచ్చటించి శుభాకాంక్షలు అందించారు.
ఈ కార్యక్రమంలో దాదాన్నగారి అమర్రావు, ఆదివాసీ నాయకపొడు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచేందర్ (విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు), కేసీఆర్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డి.ఆర్.డి. సాయన్న, ఎల్. భూమారావు, శంకర్, భోజన్నతో పాటు బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.












