ఉట్నూర్, 20 July
తొలి తరం ఆదివాసీ ఉద్యమ నేత, తుడుం దెబ్బ వ్యవస్థాపకులు శ్రీ సీడం శంభు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఉట్నూర్ మండలం మత్తడిగూడ గ్రామంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ భూక్యా జాన్సన్ నాయక్ గారు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
ఉట్నూర్ మండలం మత్తడిగూడ గ్రామంలో తొలి తరం ఆదివాసీ ఉద్యమ నేత, తుడుం దెబ్బ వ్యవస్థాపకులు, ఆదివాసుల హక్కుల సాధన కోసం ఆఖరి శ్వాస వరకు నిరంతరం పోరాడిన మహనీయుడు, ఆదివాసుల ముద్దుబిడ్డ శ్రీ సీడం శంభు గారి 8వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్మారక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ భూక్యా జాన్సన్ నాయక్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీడం శంభు గారి స్మృతి వనం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ, "సీడం శంభు గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆదివాసుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన జీవితమంతా ఆదివాసుల హక్కుల సాధనకే అంకితమైంది. ఆయన చూపిన పోరాట పంథా, ఆశయాలు నేటి యువతకు, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం ఆయన కలలు కన్న సమాన హక్కుల సమాజ నిర్మాణానికి మనమంతా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.












