వనపర్తి, జూన్ 16
ణ27.0మఈొమమఅజమమఖమమ.జొబహైఅమ.
తెలంగాణ రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు ఈ నెల 15 ఆగస్టు లోగా తొమ్మిది రకాల వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్లను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.
చదువుకుంటే జీవితాలలో వెలుగులు నింపుతుందని, భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం పిలుపునిచ్చారు.
వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో బుధవారం సాయంత్రం ప్రభుత్వ బాలికల హైస్కూల్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని తాను నమ్ముతున్నానని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ, ఐటీ, ఫైనాన్స్, ఇరిగేషన్ వంటి కీలకమైన శాఖలు ఉన్నప్పటికీ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా తన దగ్గరే ఉంచుకున్నానని తెలిపారు.
మలిదశ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు ఉద్యమ బాట పట్టడం వల్ల ఇషాన్ రెడ్డి, శ్రీకాంతాచారి, యాదయ్య, పోలీస్ కిష్ణయ్య వంటి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. గత పదేళ్లుగా విద్యను పట్టించుకోకుండా ధనార్జన చేసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీల నుంచి ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల వరకు మొత్తం నిర్లక్ష్యం చేసి పేద ప్రజలకు విద్యను దూరం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో గతంలో 35, 36 స్థానంలో ఉన్న విద్యారంగం నేడు 18వ స్థానానికి చేరిందని తెలిపారు. ఈ ఘనత ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులదేనని అన్నారు.
ప్రస్తుతం 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు, 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 27 లక్షల మంది విద్యార్థులకు 9 రకాల వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్టును ఆగస్టు 15లోపు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.











