(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
బోథ్ మండలంలోని జడ్పీ సెకండరీ పాఠశాల కౌట (బి)లో ఆరోగ్య పాఠశాల 3.0 కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకురాలు మునిగెల యోగిత విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. యోగాతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని, చదువుకునే సమయంలో ఏకాగ్రత పెరుగుతుందని, అలాగే చరవాణి వాడకం తగ్గుతుందని ఆమె వివరించారు.

ప్రతీరోజు ఉదయం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, విద్యార్థులకు జ్ఞాన ముద్ర, ప్రాణ ముద్ర, శూన్య ముద్ర, సూర్య ముద్ర వంటివి మానసికంగా దృఢంగా ఉండేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాల అసెంబ్లీ సమయంలో ఈ ముద్రలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శశిధర్ రెడ్డి, పీడీ యశోధర, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్, సుదర్శన్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.