** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్యను ఎద్దేవా చేస్తూ ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనే ఆన్లైన్ ఉద్యమం అనతికాలంలోనే సంచలనం సృష్టించింది. కేవలం కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్, భాజపాలను అధిగమించి ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే, ఇది అధికారిక రాజకీయ పార్టీ కాదు.
ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్, భాజపాలను దాటేసి ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ). అయితే, ఇది ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ కాదు, కేవలం జెన్-జీ ఉద్యమం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ మొదలైన ఈ ఆన్లైన్ ప్రచారం అనతికాలంలోనే ఉద్ధృత రూపం దాల్చి, కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు ఎదిగింది.
బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుని, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అభిజీత్ దీప్కే మే 16న ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
‘కొందరు యువత బొద్దింకల్లాంటివాళ్లు. వాళ్లకు ఉద్యోగాలు ఉండవు. వృత్తుల్లోనూ ఉండరు. వాళ్లలో కొందరు పాత్రికేయులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, సమాచార హక్కు చట్టం ప్రచారకర్తలుగా మారి.. అందరిపైనా దాడులు చేస్తారు’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఆన్లైన్ ప్రచారానికి అతికొద్ది కాలంలోనే వేలాది మంది యువత సైన్ అప్ చేశారు. ఇది అతడిని సైతం ఆశ్చర్యపరిచింది.
సీజేపీలో ప్రధానంగా 10 మంది నాయకులున్నారు. వారు: అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, విజేత దహియా, సోనమ్ వాంగ్చుక్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, అమూల్య ధవన్, రోనక్ ఖత్రీ, అర్పిత్ శర్మ.
ఒకవేళ సీజేపీ అధికారంలోకి వస్తే తమ మ్యానిఫెస్టో ఇలా ఉంటుందని వారు తెలిపారు: ప్రధాన న్యాయమూర్తులెవరికీ పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఓటు తీసేస్తే సీఈసీని ఉపా కింద అరెస్టు చేయాలి. మహిళలకు చట్టసభల్లోనూ, మంత్రివర్గంలోనూ 50% రిజర్వేషన్ కల్పించాలి. అంబానీ, అదానీల మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలి. ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ మారితే 20 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవి చేపట్టకుండా నిషేధించాలి.
జూన్ 6న అభిజీత్ దీప్కే అమెరికా నుంచి రాగానే జంతర్ మంతర్ వద్దకు భారీగా యువత తరలివచ్చారు. అప్పటినుంచి డిజిటల్ ప్రచారం మొదలైంది. జూన్ 20న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. 22 నుంచి 27 వరకు వేలాది మందితో కలిసి నిరసనలు చేశారు. 28న సోనమ్ వాంగ్చుక్ అక్కడికి వచ్చి నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది.












