పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం భైంసాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ లక్ష్యాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
భైంసాలో సోమవారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం ప్రారంభమైంది. ఎస్ఎస్ జినింగ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ హాజరయ్యారు.
పార్టీ క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు భారత్ మాత, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, దిశానిర్దేశక అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే పీ. రామారావు పటేల్, రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రముఖ వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన దిశలో పార్టీ ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. పలువురు వక్తలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.












