భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు బాసరలో ఘనంగా నిర్వహించబడ్డాయి. డాక్టర్ కిరణ్ కోమ్రే ఆదేశాల మేరకు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో కెసిఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పేదలకు అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అపర భగీరథుడిగా పేరుగాంచిన కెసిఆర్ నాయకత్వంపై కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బాసర మాజీ ఉపసర్పంచ్ లాల్ మియా, సీనియర్ నాయకులు శ్రీనివాస్ పోశెట్టి, గంగాధర్, మోహిజ్, సాయి కృష్ణ, సాయి ప్రసాద్, రాజు, రవి, పిరాజి, సాయినాథ్ తదితరులు, ప్రజా ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

