ఖానాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అజ్మీరా గోవింద్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు.
మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్. వేణుగోపాల చారి, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ ఖానాపూర్లోని గోవింద్ నాయక్ నివాసానికి వెళ్లి, ఆయన సతీమణి మరియు సోదరుడు హరినాయక్లను కలిసి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా, గోవింద్ నాయక్ ప్రజలకు అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బనవత్ గోవింద్ నాయక్, బీసీ సెల్ నాయకుడు డాక్టర్ వేని మనోజ్ యాదవ్, స్వర్ణ ప్రాజెక్టు మాజీ అధ్యక్షుడు ఒలత్రి నారాయణరెడ్డి, దేవరకొట మాజీ డైరెక్టర్ సంతోష్ కుమార్, సతీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.












