కుబీర్, ఆగస్టు 4
కాంగ్రెస్ పార్టీలో తనకు పదవులు వచ్చినా రాకున్నా, తన నాయకుడు బోస్లే నారాయణరావు పటేల్ నాయకత్వంలోనే పనిచేస్తానని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంక బాబు తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకున్నా, తనకు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బోస్లే నారాయణరావు పటేల్ గారి అభిమానిగా ఆయనతో కలిసి ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
ముధోల్ తాలూకాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా గడ్డన్న హయాం నుంచి పార్టీలో కొనసాగుతున్నానని బంక బాబు తెలిపారు. పార్టీ కోసం, నాయకత్వం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన అన్నారు.
పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని, పార్టీ ఎవరికి బాధ్యతలు అప్పగించినా తనకు అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తగా తన వంతు బాధ్యత నిర్వహిస్తానని బంక బాబు తెలిపారు.