నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్సీబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మిర్యాలగూడ ట్రాన్స్కో డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా కార్మికులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీవీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్సీబీ (APSEB) నిబంధనలను అమలు చేయాలని విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వాన్ని కోరారు.
కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈవీసీ ట్రాన్స్కో కంపెనీ నాయకులు కొప్పోలు రవి వర్మ, భవాని, అనిత, సతీష్, కిరణ్ కుమార్, సురేష్, నాగయ్య, సైదులు, వీరయ్య, ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.












