ముధోల్, జూలై 8
ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి కుటుంబం అందించిన మొక్కలను నాటి సంరక్షించి, ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, ప్రవీణ్, సంజీవ్, ఎర్రన్న, ప్రకాష్, మల్లేష్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












