Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
108 అంబులెన్స్‌లలో పాముకాటుకు విరుగుడు మందు అందుబాటులో ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజామాబాద్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ ఖండించారు. ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయాలని సూచించారు.
108 అంబులెన్స్‌లలో పాముకాటుకు విరుగుడు మందు అందుబాటులోకి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిజామాబాద్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ తెలిపారు.
వైరల్ అవుతున్న సందేశాన్ని ప్రజలు నమ్మవద్దని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108కు కాల్ చేయాలని ఆయన సూచించారు. పాముకాటు బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమే 108 సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే యాంటీ స్నేక్ వెనం (ASV) ఇంజెక్షన్ ఇస్తారని, 108 అంబులెన్స్‌లలో విరుగుడు మందు అందుబాటులో లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












