కాన్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవాలనే మోజు 32 ఏళ్ల మహిళ జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. ఢిల్లీలో టాటూ వేయించుకున్న ఆమె, కలుషితమైన నీడిల్ వాడకం వల్ల హెచ్ఐవీ బారిన పడింది. వైద్య పరీక్షల అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పచ్చబొట్టు (టాటూ) మీద మోజు ఒక 32 ఏళ్ల మహిళ జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. కాన్పూర్ కు చెందిన ఈ మహిళ ఢిల్లీలోని ఒక పార్లర్లో టాటూ వేయించుకుంది. అయితే, టాటూ వేయించుకున్న కొద్ది వారాలకే ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ మొదలైంది. ఇది క్రమంగా తీవ్రం కావడంతో ఆ మహిళ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంది.
వైద్యులు అనుమానంతో ఆమెకు వివిధ రకాల పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. టాటూ వేయడానికి ఉపయోగించిన ఇంజక్షన్ లేదా నీడిల్స్ కలుషితం కావడం వల్లే ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని జిఎస్విఎం మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో నీడిల్ ద్వారానే హెచ్ఐవీ సంక్రమించినట్లు డెర్మటాలజీ విభాగం పేర్కొంది.
స్టెరిలైజ్ చేయని లేదా కలుషితమైన నీడిల్ ఉపయోగించి టాటూ వేయడం వల్ల ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.












