నిజామాబాద్, 19 July
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, 108 అంబులెన్స్‌లలో పాముకాటు విరుగుడు మందు అందుబాటులో ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఇంజెక్షన్లను కేవలం ఆసుపత్రుల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. 108 అంబులెన్స్‌లలో పాముకాటుకు విరుగుడు (యాంటీ స్నేక్ వెనం) ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
పాముకాటు విరుగుడు ఇంజెక్షన్లను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, తగిన వసతులున్న ఆసుపత్రుల్లోనే ఇవ్వాలని, లేని పక్షంలో రోగికి తీవ్రమైన రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. 108 సిబ్బంది బాధితులను సకాలంలో సురక్షితంగా ఆసుపత్రికి తరలించేందుకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన వెల్లడించారు.












