అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
వనపర్తి పట్టణం 22వ వార్డుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాజుద్దీన్ కాలు విరిగి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని 20వ వార్డు గాంధీనగర్‌కు చెందిన ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు ఉండేకోటి లక్ష్మయ్య ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించిన మాజీ మంత్రి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ సూగూరు మురళి సాగర్, నీలస్వామి, గులాం ఖాదర్, పరంజ్యోతి, సూర్యవంశం గిరి, మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి, దేవర్ల నరసింహ, జోహార్ హుస్సేన్, అస్లాం ఖాన్, ఏకే పాషా, చిట్యాల రాము, తోట శ్రీను, బాలరాజు, విజయ్, తరుణ్, బన్నీ, సాయి, భాను, చైతన్య, కార్తీక్, శశాంక్, శ్వేతానగర్ కాలనీ అధ్యక్షుడు రసూల్, సల్మాన్, హుస్బుద్దీన్, షకీల్, అతీక్, ఆసిఫ్, మోయిన్, ఖాజామైనుద్దీన్ (రిటైర్డ్ హెచ్ఎం) తదితరులు పాల్గొన్నారు.












