సొంపేట, ఆగస్టు 1
సోంపేట గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధోని గంగయ్య అనే ప్రభుత్వ ఆసుపత్రి అటెండర్ గుండెపోటుతో మృతి చెందారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మెండోరా: సోంపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధోని గంగయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడు గంగయ్య మెండోరా ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి వార్తతో సోంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పలువురు గ్రామస్థులు గంగయ్య మృతికి సంతాపం తెలిపారు.












