ఖానాపూర్, 30 July
ఖానాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా తలెత్తే ఇబ్బందుల్లో పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ గారు విజ్ఞప్తి చేశారు.
నదులు, వాగులు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని, చిన్నారులను ఇంటి బయటకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రైతులు తమ పంట పొలాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.












