కుంటాల, జూలై 21
భవష్యత్ తరాలు నీట భద్రత ల్పంచే ల్ష్యంతో, ప్రత నీట బొట్టును భూమలో ఇంంచేలా 'జలసర' ాయ్రమాన్న గ్రామపంచాయతీ అధారులు చేపడుతున్నారు ుంటాల మండల ేంద్రంలో నవహంచన గ్రామసభలో, ప్రత ఇంట మ్యాజ్ సో్పట్, ప్రత వ్యవసాయ ్షేత్రాన ఫామ్‌పాండ్, ప్రభుత్వ భవనాలు రూఫ్‌టాప్ రైన్వాట హావెస్టంగ్ వంట పథాలపై అధారులు వవరంచారు
భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలంటే వర్షపు నీటిలో ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించాల్సిందేనని గ్రామపంచాయతీ అధికారులు పిలుపునిచ్చారు. కుంటాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో మంగళవారం జలసిరి గ్రామసభను పంచాయతీ కార్యదర్శి రాజాబాపు పర్యవేక్షణలో, ఉపసర్పంచ్ పరికిపండ్ల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సమావేశంలో వీబీజీ రామ్‌జీ (VBG Ram G) పథకం ద్వారా ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్‌పిట్, ప్రతి వ్యవసాయ చేనుకు ఫామ్‌పాండ్, ప్రభుత్వ స్థలాల్లో కమ్యూనిటీ సోక్పిట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రూఫ్‌టాప్ రైన్వాటర్ హార్వెస్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు అందిస్తోందని వివరించారు. ఈ నిర్మాణాల ద్వారా వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడడంతో పాటు తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ప్రజలందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, ప్రభుత్వ స్థలాల్లో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఐకేపీసీసీ ముత్యం, వార్డు సభ్యులు నాగులపల్లి మాధవరావు, న్యాకపు నరేందర్, గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మ్యాజిక్ సోక్‌పిట్ ద్వారా ఇంటి వద్ద వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. కమ్యూనిటీ సోక్‌పిట్ ద్వారా ప్రభుత్వ స్థలాలు, కాలనీల్లో చేరే వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించి నీటి నిల్వ పెంచుతారు. ఫామ్‌పాండ్ ద్వారా రైతులు వర్షపు నీటిని నిల్వ చేసుకుని సాగు, పశువుల అవసరాలకు వినియోగించుకోవచ్చు. రూఫ్‌టాప్ రైన్వాటర్ హార్వెస్టర్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర భవనాల పైకప్పులపై పడే వర్షపు నీటిని సేకరించి భూమిలోకి పంపిస్తారు.
దీంతో భూగర్భ జలాల మట్టం పెరగడం, తాగునీటి కొరత తగ్గడం, నీటి వృథా నివారణ, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు నీటి భద్రత సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. "ప్రతి ఇంటా ఇంకుడు గుంత... ప్రతి చేనులో ఫామ్‌పాండ్... ప్రతి నీటి బొట్టు భూమిలోకే" అనే నినాదంతో జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.












