టైమ్స్) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
లోకేశ్వరం మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. భూగర్భ జలాలను పెంపొందించి నీటి కొరతను అధిగమించేందుకు ప్రతి చేనుకు ఫామ్పాండ్లు, ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ వ్యవస్థల ఏర్పాటుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించే చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని గ్రామపంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ప్రతి చేనుకు ఫామ్పాండ్లు, ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ వ్యవస్థల ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంపొందించి నీటి కొరతను అధిగమించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించే చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్, ఉపసర్పంచ్ లక్కంపల్లి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఇన్చార్జి ఏపీఓ అనిల్ పాల్గొని జలసిరి కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.












