కడం (పెద్దూర్), 14 July
కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కడెం సబ్ ఇన్స్పెక్టర్ *కడెం si జిల్లా ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు పొద్దుటూరి *కడెం కిరణ్*తో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు మన భవిష్యత్ తరాలకు జీవదానం అని ఈ సందర్భంగా వారు తెలిపారు.
కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడెం సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, జిల్లా ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు పొద్దుటూరి సంపత్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా SI సాయి కిరణ్, సంపత్ రెడ్డిలు మాట్లాడుతూ మొక్క అంటే కేవలం చెట్టు కాదని, అది మన భవిష్యత్ తరాలకు ఇచ్చే జీవదానమని అన్నారు. ఒక్క చెట్టు సంవత్సరానికి 20 కిలోల కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చి, మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఇస్తుందని తెలిపారు.
వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించి, వర్షాలు పడేలా చేసేది చెట్లేనని, మట్టి కోతను ఆపి, భూగర్భ జలాలను పెంచేది కూడా వృక్షాలేనని చెప్పారు. పక్షులకు, జీవరాశులకు ఆవాసం కల్పించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుందని తెలిపారు.
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అరుణ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












