బాసర, 14 July
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బాసర గ్రామ సర్పంచ్ సోలంకి దైవశాల పిలుపునిచ్చారు. గ్రామంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆమె వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బాసర గ్రామ సర్పంచ్ సోలంకి దైవశాల అన్నారు. గ్రామంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆమె వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చెట్లు పెరగడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












