Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, జలసిరి ఫామ్ పాండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, జలసిరి ఫామ్ పాండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వన మహోత్సవం, జలసిరి ఫామ్ పాండ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మండలాల వారీగా వన మహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలని, శాఖల వారీగా మొక్కల నాటకం ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. జలసిరి ఫామ్ పాండ్లు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, గడువులోగా పనులు పూర్తి చేసి భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పడాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమీక్షిస్తూ, ఎల్-3 జాబితాలో ఉన్న నిజమైన అర్హుల పేర్లను క్షేత్రస్థాయిలో ధృవీకరించి, పారదర్శకంగా అన్ని ధృవీకరణ ప్రక్రియలు పూర్తి చేసి వారికి ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల సమీపానికి పశువుల కాపరులు, మత్స్యకారులు, ప్రజలు వెళ్లకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.












