Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
మండల కేంద్రంలోని వివేకానంద హై స్కూల్లో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు శివసత్తులు, పోతురాజుల వేషధారణలో ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
మండల కేంద్రంలోని వివేకానంద హై స్కూల్లో బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివసత్తులు, పోతురాజుల వేషధారణతో ఆకట్టుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ నేరెళ్ల ఉషారాణి విద్యార్థులకు బోనాల పండగ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సముద్రాల గీత, ప్రిన్సిపాల్ నేరెళ్ల ఉషారాణి, వైస్ ప్రిన్సిపాల్ మర్రి కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










