నిర్మల్, 2026-07-24
విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారం, పోలీసుల దాడులను నిరసిస్తూ ఎన్ఎస్యూఐ (NSUI)తో పాటు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు ముధోల్ నియోజకవర్గం, నిర్మల్ జిల్లాలో విశేష స్పందన లభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్కు సహకరించాయి.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం, విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ ఎన్ఎస్యూఐ (NSUI)తో పాటు ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF), పీడీఎస్యూ (PDSU), ఏఐఎఫ్డీఎస్ (AIFDS), ఏఐఎస్బీ (AISB), ఏఐపీఎస్యూ (AIPSU) తదితర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు ముధోల్ నియోజకవర్గం, నిర్మల్ జిల్లాలో విశేష స్పందన లభించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్కు సహకరించగా, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజాస్వామ్యవాదులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థుల గొంతుకను అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమర్థంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
ఈ విజయవంతమైన బంద్కు సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాస్వామ్యవాదులు మరియు అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు ఎన్ఎస్యూఐ నిర్మల్ జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జ్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో జరిగిన వరుస వైఫల్యాలపై పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత పునరుద్ధరించబడే వరకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు NSUI దేశవ్యాప్తంగా తన ప్రజాస్వామ్య పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మరియు ముధోల్ నియోజకవర్గం NSUI నాయకులు అంజద్ షేక్, వాగ్మారే ప్రతీక్, కాంలేకర్ శశి కుమార్, గంగాప్రసాద్, నికిల్, హరి తదితరులు పాల్గొన్నారు.












