బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
ఏఐఎస్ఎఫ్ (విద్యార్థి సంఘాలు)ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని, నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి బాధ్యత వహించి ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ఏఐఎస్ఎఫ్ (విద్యార్థి సంఘాలు)ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిపిన జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతం అయింది. విద్యార్థులపై లాఠీచార్జి ఒక దుర్మార్గమైన చర్య అని ఏఐఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ కుంభకోణం, విద్యార్థులపై జరిగిన పోలీసు దమనకాండ, ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనకు బాధ్యత వహించి ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ను విడుదల చేయాలని కోరారు.
విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బీజేపీ విధానాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మున్సిపల్ ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.












