*☝️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
తెలంగాణలో రేపు, అంటే ఈ నెల 24న (శుక్రవారం), రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసనలకు మద్దతుగా ఈ బంద్ కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.
రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఈ నెల 24న (శుక్రవారం) బంద్ చేసి, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్ సంఘాలు ఈ ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, NTAను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.












