భైంసా, జూలై 23
మనోరంజని తెలుగు టైమ్స్: భైంసా మండలంలోని మహాగాం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుదలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడిని అభినందించి, విద్యా మూల్యాంకనాన్ని పరిశీలించారు.
భైంసా మండలంలోని మహాగాం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిన తీరును తెలుసుకుని ప్రధానోపాధ్యాయుడు ఎన్. కృష్ణను అభినందించి సన్మానించారు.
అనంతరం పాఠశాలలో అమలవుతున్న పునాది స్థాయి అక్షర, సంఖ్యా అభ్యాస కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ప్రారంభ స్థాయి విద్యా మూల్యాంకనాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను తెలుసుకుని బోధనను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేశారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన పోషకాహార తోటను పరిశీలించిన జిల్లా విద్యాధికారి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తోటలో ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సందేశాన్ని అందించారు.
జిల్లా విద్యాధికారి వెంట కుబీర్ మండల విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్, మహాగాం సముదాయ ప్రధానోపాధ్యాయుడు ఎన్. కనకరాజు, మహాగాం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. కృష్ణ, ఉపాధ్యాయులు హరీష్, రాగిణి, అభిషేక్, శ్రీలతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.












