ఖానాపూర్, జూలై 29
ప్రాథమిక పాఠశాలలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 25ను సవరించాలని డిమాండ్ చేస్తూ భైంసా మండల ప్రాథమిక ఉపాధ్యాయులు బుధవారం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని వారు కోరారు.
ప్రాథమిక పాఠశాలలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 25ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ భైంసా మండల ప్రాథమిక ఉపాధ్యాయులు బుధవారం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని కోరారు. 20 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 21 నుంచి 40 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు, 41 నుంచి 60 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. 60 మందికి పైగా విద్యార్థులు ఉంటే ఒక పీఎస్ హెచ్ఎం (ప్రధానోపాధ్యాయుడు), 60 నుంచి 80 మంది విద్యార్థులు ఉంటే అదనంగా ఒక పీఈటీ ఉపాధ్యాయుడిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ పల్స్కేల్ శ్రీనివాస్, పలువురు ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












