నిర్మల్, జూలై 15
నిమలజిలలాకుచందిన16మందివిదయాథులుగిననిసపపంచికాుసాధించంజిలలాకుగవకాణమనిభాతీయజనతాపాటీశాసనసభాపకషనేత,నిమలఎమమలయేఏలేటిమహేశవిఅననాు.హైదాబాదలోనిగచచిబౌలిలోఏపిల26నజిగినకాటేపదశనలోవీుికాునలకొలపాు.
నిర్మల్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడం జిల్లాకు గర్వకారణమని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ క్రీడా ప్రాంగణంలో ఈ ఏడాది ఏప్రిల్ 26న నిర్వహించిన కరాటే ప్రదర్శనలో నిర్మల్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరాటే శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్నంలో సుమారు 1,800 మంది విద్యార్థులు ఒకేసారి అరగంట పాటు కరాటే విన్యాసాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పారని తెలిపారు. ఆ కార్యక్రమంలో నిర్మల్ జిల్లాకు చెందిన 16 మంది విద్యార్థులు పాల్గొని ప్రపంచ రికార్డు సాధించినట్లు ధ్రువీకరణ పత్రాలు, పతకాలు అందుకోవడం జిల్లాకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
విద్యార్థుల కృషిని అభినందించిన ఎమ్మెల్యే, వారి తల్లిదండ్రులు, శిక్షకులు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి నిర్మల్ జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.












