శాంతినగర్‌లోని న్యూ ప్రగతి విద్యాలయం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. కరస్పాండెంట్ వకులాభరణం ఆదినాథ్ పర్యవేక్షణలో అధ్యాపకుల కృషితో విద్యార్థులు ఈ ఘనత సాధించారు.
45 ఏళ్ల అనుభవంతో విద్యార్థుల క్రమశిక్షణ, విద్యా, క్రీడారంగాల్లో రాణించేలా పాఠశాల కృషి చేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపునకు యోగా, పౌష్టికాహారం అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
విద్యార్థులు ఇష్టంతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, అధ్యాపకులకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అధ్యాపకులు అదనపు తరగతులు, పరీక్షల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారని ఆయన వివరించారు.











