శాంతినగర్‌లోని న్యూ ప్రగతి విద్యాలయం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి, విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. కరస్పాండెంట్ వకులాభరణం ఆదినాథ్ ఆధ్వర్యంలో అధ్యాపకుల కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది.
పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం, 45 సంవత్సరాల అనుభవంతో విద్యార్థుల క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ న్యూ ప్రగతి విద్యాలయం ముందుకు సాగుతోంది. విద్యా రంగంతో పాటు క్రీడారంగంలోనూ విశేష ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, యోగా, పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నట్లు తెలిపింది.
విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఇది వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతోందని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది. అధ్యాపకుల సహకారంతో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటున్నారని పేర్కొంది.
వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు శిక్షణ అందించడం పాఠశాల ప్రత్యేకత. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, నిరంతర పరీక్షల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు.
ఈ కృషి ఫలితంగానే ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి, పాఠశాల తన విద్యా ప్రమాణాలను మరోసారి నిరూపించుకుంది.











