బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన జరిగింది. ఈ నిరసనలో పార్టీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన జరిగింది. టీపీసీసీ, డీసీసీ మరియు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆదేశాల మేరకు బోథ్ మండల కన్వినర్ మేరుగు భోజన్న నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు. బోథ్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన సీపీఐ నాయకులు, విద్యార్థులు కలిసి ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను పదవి నుంచి తొలగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జరిగిన దాడిని కాంగ్రెస్, సీపీఐ నాయకులు, మిత్రపక్షాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, సీపీఐ జిల్లా అధ్యక్షుడు భారతల గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు మేరుగు నర్సింహాదాస్, బొడ్డు గంగారెడ్డి, చట్ల ఉమేష్, అచ్యుత్ రెడ్డి, షేక్ అబూద్, షేక్ మొహమ్మద్, కౌసర్, రహిముద్దీన్, యూసుఫ్, షేక్ షాకీర్, బోజ్జ సాయన్న, వినయ్ రెడ్డి, అరుణ్ కుమార్, శమిందర్ రెడ్డి, సున్నపు శ్రీనివాస్, భీమా బుచ్చన్న, శంషుద్దీన్, సన్నీ రెడ్డి, జల్పత్, కాంగ్రెస్ నాయకులు, సీపీఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












