బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
బోథ్ మండల కేంద్రంలోని నాగభూషణం పాఠశాలలో స్నేహితుల దినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
మండల కేంద్రంలోని స్థానిక నాగభూషణం పాఠశాలలో స్నేహితుల దినోత్సవం అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది.
విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కిషోర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అందరితో కలిసి స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. స్నేహం అంటే ఒకరినొకరు తోడుగా నిలవడం, కష్టంలో చేయూతనివ్వడం, ఆనందాన్ని పంచుకోవడం అని స్నేహం యొక్క విలువను విద్యార్థులకు తెలియజేశారు.
అనంతరం విద్యార్థులు స్నేహ బ్యాండ్ల మార్పిడి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.









